Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవరిలో ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం - సభ్యత్వం కోసం ఓ మిస్డ్ కాల్...

Advertiesment
kcrao
, సోమవారం, 26 డిశెంబరు 2022 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమరావతిలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏర్పాట్లలో బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిమగ్నమైవున్నారు.
 
అన్ని అనుకూలంగా సాగితే ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని జనవరి నెలలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అదేసమయంలో ఏపీలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదై పనులు కూడా వేగవంతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం 94940 15222 అనే మొబైల్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా బీఆర్ఎస్ సభ్యత్వం కావాలని కోరుకుంటే ఈ మొబైల్ నంబరుకు మిస్‌కాల్ ఇవ్వొచ్చు. 
 
అంతేకాకుండా, బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే నేతలకు జీవిత బీమా సదుపాయాన్ని కల్పించనున్నారు. గతంలో తెరాస ఏర్పాటైన తర్వాత ఆ పార్టీలో చాలా మంది చేరారు. వారందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు. ఇపుడు ఇదే తరహా సభ్యత్వాన్ని బీఆర్ఎస్‌లో చేరే కార్యకర్తలకు కల్పించాలని భావిస్తున్నారు. అలాగే, తనతో సన్నిహితంగా ఉండే నేతలతో సీఎం కేసీఆర్ టచ్‌లో ఉంటూ, వారందర్నీ తమ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యానికి బానిసైన వ్యక్తిని పిల్లనివ్వకండి.. కౌశల్ కిశోర్