Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు ఫోన్ చేసిన సుడిగాలి సుధీర్.. ఎమోషనల్ అయిన ఎమ్మెల్యే!

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:15 IST)
జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కిట్లపై సుధీర్ ప్రాణం పెట్టేస్తుంటాడు. అందుకే అభిమానులకు సుధీర్ అంటే అంత ఇష్టం అని చెప్పాలి. ముఖ్యంగా ఈవెంట్స్ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కొన్ని మ్యాజిక్ స్టంట్స్ చేయడం సుధీర్ స్పెషాలిటీ అని చెప్పాలి.
 
ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం సుధీర్ వారిని కలిసేందుకు పర్సనల్ గా వాళ్ల ఇళ్లకు వెళ్తుంటాడు. అంతేకాదు కొత్త టాలెంట్స్‌ను ప్రోత్సహించడం కూడా సుధీర్‌కు చాలా ఇష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా సుధీర్ ప్రోత్సాహంతోనే టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దుర్గారావు టెలివిజన్‌లోకి అడుగు పెట్టాడు. 
 
అంతేకాదు తన వెనుక సుధీర్ ప్రోత్సాహం ఉందని ఇప్పటికే దుర్గారావు సైతం పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక సుడిగాలి సుధీర్ వెనుక ఉన్న ప్రోత్సాహం విషయానికి వస్తే సుధీర్ పై ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చెప్పాలి. కేవలం షోకుమాత్రమే పరిమితం కాకుండా సుధీర్ కెరీర్ ఎదుగుదలకు ఎమ్మెల్యే రోజా ప్రోత్సాహం కూడా ఒక కారణం అనే చెప్పాలి.
 
ఇక తాజాగా ఎమ్మెల్యే రోజా ఓ శస్త్ర చికిత్స నిమిత్తం జబర్దస్త్ షోకు దూరం అయ్యారు. దీంతో సుడిగాలి సుధీర్ చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుధీర్ తన ఎదుగుదలకు కారణమైన ఎమ్మెల్యే రోజా ఇలా సడెన్ గా షోకు దూరం కావడంతో జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే తాజాగా సుధీర్ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కాస్త ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే సుడిగాలి సుధీర్ కెరీర్ ఇంకా బాగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా రోజా ఆశీర్వదించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments