Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేట్ మారితే స‌క్సెస్ - పెళ్లికూతురు పార్టీ గురించి హీరో ప్రిన్స్‌

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (17:55 IST)
Prince‌, Arjun Kalyan, Aparna, A.V.R. Swami
ప్రిన్స్‌. అర్జున్ క‌ళ్యాణ్, అనీషా ధామా,  సీత‌, జ‌య‌త్రీ, సాయికీర్త‌న్‌, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్‌. స్వామి నిర్మించారు. అప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ సినిమాను జూన్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు వెల్ల‌డించారు.  ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ శనివారం ఫిలింఛాంబర్ లో జ‌రిగిన పాత్రికేయుల సమావేశంలో తెలియ‌జేశారు.
 
దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ, ఈ సినిమాను జూన్ 24న విడుద‌ల‌చేస్తున్నాం. పి.వి.ఆర్‌. సినిమాస్ బాగా స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాను నిర్మాత స్వామిగారు మాపై పూర్తి న‌మ్మ‌కంతో నిర్మించారు. కోవిడ్‌టైంలో రిస్క్ చేసి ఈ సినిమాను రూపొందించాం. ఇది అమ్మాయిల‌క‌థ‌. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో క‌థ చెప్పాను. అన్న‌పూర్ణ‌మ్మ‌గారు ప్ర‌ధాన పాత్ర పోషించారు. హీరో ప్రిన్స్‌, అర్జున్ క‌ళ్యాణ్ బాగా న‌టించారు. ఫ‌న్ అడ్వంచ‌ర్ రైడ్ సినిమా. అంద‌రూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే సినిమా అన్నారు.
 
 ప్రిన్స్ మాట్లాడుతూ, నాకు మంచి అక‌వాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. మేనెల‌లో రావాల్సిన సినిమా జూన్ 24న రాబోతుంది. ఈమ‌ధ్య కాలంలో డేట్ మారిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. మా సినిమాకూడా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. పి.వి.ఆర్‌. సినిమాస్ మా సినిమాను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా వుంది. ఫ్యామిలీతో వ‌చ్చి న‌వ్వుకునే సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. శ్రీ‌క‌ర్ అగ‌స్తీ సంగీతం బాగా పాపుల‌ర్ అయింది. న‌రేష్ విజువ‌ల్స్ బాగా చూపించాడు. ఇటీవ‌లే క్యూబ్‌లో వాటికి మంచి స్పంద‌న వ‌చ్చింది అన్నారు. 
 
అర్జున్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ, నాకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్స‌హించారు. పైలెట్‌గా న‌టించాను. ఈనెల 24న విడుద‌ల‌వుతున్న మా సినిమా ఫ్యామిలీ డ్రామా. అన్ని ఎమోష‌న్స్ వున్నాయి. ఈ సినిమా ద్వారా ప్రిన్స్ మంచి ఫ్రెండ్ దొరికాడు. మా నిర్మాత‌కు మంచి క‌లెక్ష‌న్లు రావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
 
హీరోయిన్ జ‌య‌త్రీ మాట్లాడుతూ, నేను యూట్యూబ్ ద్వారా అందరికీ తెలుసు. దాని వ‌ల్లే నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. డి.ఓ.పి. మంచి విజువ‌ల్స్ చూపించారు. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ క‌థ‌. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమా అన్నారు. 
 
నిర్మాత ఎ.వి.ఆర్‌. స్వామి మాట్లాడుతూ, మా ట్రైల‌ర్ బాగా న‌చ్చి పి.వి.ఆర్‌. సినిమాస్ స‌పోర్ట్ చేశారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని ఉభ‌య‌గోదావ‌రి, వైజాగ్‌నుంచి కూడా థియేట‌ర్లు ఇస్తామ‌ని ఫోన్లు చేస్తున్నారు. అదేవిధంగా. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఏషియ‌న్స్ వారు కూడా మంచి స‌పోర్ట్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి కూడా ఫోన్లు వ‌స్తున్నాయి. ఇది మా సినిమాకు మంచి శుభ‌ప‌రిణామం. ద‌ర్శ‌కురాలు అప‌ర్ణ మంచి ఎచీవ్‌మెంట్‌తో సినిమా తీశారు. న‌టీన‌టులు బాగా న‌టించారు. జూన్ 24న విడుద‌ల‌వుతున్న మా సినిమాకు అంద‌రి స‌పోర్ట్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments