క‌శ్మీర్ ఫైల్స్ కాంబినేష‌న్‌లో భారతదేశం మూలాల్లో కథలు రాబోతున్నాయి

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (10:16 IST)
Abhishek Agarwal, Vivek Ranjan Agnihotri, Tej Narayan Agarwal, Pallavi Joshi
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి ఈ ఏడాది 'కాశ్మీర్ ఫైల్స్' భారీ బ్లాక్బస్టర్ను అందించారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో  అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇప్పుడు ఇంకొన్ని  గొప్ప కథలను చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి శుభ సందర్భంగా.. ఈ విజయవంతమైన కాంబినేషన్‌లో తదుపరి చిత్రాలను సమర్పించనున్న అభిషేక్ తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమక్షంలో, ఇరు నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్‌లు చేసుకున్నాయి.
 
వారి మునుపటి సినిమాలలానే బ్యానర్ లో వచ్చే తదుపరి సినిమాలు కూడా భారతదేశంలో మూలాల్లో, నిజమైన, నిజాయితీ, మానవత్వంకు సంబధించిన కథల ఆధారంగా ఉండబోతున్నాయి.
 
 “ఈ పండగ రోజున, మన అందమైన దేశంలోని ప్రజలకు మన మాతృభూమి గురించి కథలు చెప్పడానికి @i_ambuddha, @vivekagnihotri , #PallaviJoshiతో కలిసి మరో ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాము. జై హింద్.” అని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తెలిపింది.
 
 “ఈ పండగ రోజున, @iambuddhafoundation & @AAArtsOfficial భారత్ లో మూలాల్లో  కథలను చెప్పడానికి,  భారతీయ పునరుజ్జీవనానికి దోహదపడేందుకు మరోసారి చేతులు కలిపాము. మిస్టర్ & మిసెస్ తేజ్ నారాయణ్ అగర్వాల్ @aaartsofficial @kaalisudheer @vivekagnihotri .” అంటూ పల్లవి జోషి పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments