Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహ‌న్‌లాల్ కు అపురూప‌దృశ్యాల‌తో శుభాకాంక్ష‌లు తెలిపిన స్టార్స్‌

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (18:55 IST)
Lal-rajani-balayaa,viajayasanthi
మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజైన ఈ శుక్ర‌వారంనాడు సినీ ప్ర‌ముఖులు అప్ప‌టి జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటున్నారు. ముఖ్యంగా 1993లో నిప్పురవ్వ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వంలో దిగిన ఫొటో అల‌రిస్తోంది. అప్పుడు అంద‌రినీ పూల‌మాల‌తో త‌స్క‌రించిన దృశ్యం అది. బాల‌య్య ఫ్యాన్స్ త‌న సోష‌ల్‌మీడియా దీన్నిపెట్టారు. ఈ చిత్రం బాలయ్య, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించి చివరి చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని సాధించలేదు.
 
balayya- mohanlal
అదేవిధంగా బాల‌కృష్ణ త‌న సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌తో కూర్చుని మంత‌నాలు జ‌రుపుతున్న ఫొటోను పెట్టి సంతోషం వ్య‌క్తం చేశారు. స్టార్ ఆఫ్ మాలీవుడ్ ఇండ‌స్ట్రీఅని పేర్కొన్నారు.
 
ram charan-lal-chiru
మెగాస్టార్ చిరంజీవి అయితే, సినిమాటిక్ టాలెంట్‌లో ప‌వ‌ర్ హౌస్‌లాల్‌జీ అంటూ సంబోధించారు. గొప్ప మాన‌వ‌తావాధి,  ల‌వ్ లీ బ్ర‌ద‌ర్‌, పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఎల్ల‌ప్పుడూ మీ న‌వ్వు ఇలానే వుండాలంటూ పేర్కొన్నారు.
 
lal- prabhas
ఇక రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కూడా ఆయ‌న‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తుచేసుకున్నారు. సర్ స్మైలింగ్ ముఖం మీది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గ‌డ‌పాలి అంటూ ట్వీట్ చేశాడు.
 
lal-ntr
మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్‌.టి.ఆర్‌., మోహ‌న్‌లాల్ కాంబినేష‌న్‌లో జ‌న‌తా గేరేజీ సినిమా వ‌చ్చింది. షూటింగ్‌లోని ఆయ‌న‌తో వున్న క్ష‌ణాల్ని ఒక్క‌సారి గుర్తుచేసుకున్నారు. ఎంతో మేథావి సార్‌.. మీతో గ‌డిపిన క్ష‌ణాలు ఎంతో నేర్చుకునేలా చేశాయి. ఆరోగ్యంగా వుండాల‌ని పోస్ట్ చేశాడు.
 
sanjana-chiru-lal
ఇక సంజ‌నా గ‌ల్రాని న‌టి కూడా మోహ‌న్‌లాల్‌తోపాటు చిరంజీవితో క‌లిసిన ఫొటో షేర్ చేసింది. మోహ‌న్‌లాల్‌తో ఏదో సిప్ చేస్తూ ఆయ‌న ఒడిలో కూర్చుని వున్న ఫొటో పెట్టి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments