Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ ప్ర‌శంస‌లందుకున్న ఏక్ మినీ కథ ట్రైల‌ర్‌

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:54 IST)
Prabhas twitter
అమెజాన్ ప్రైమ్ వీడియో స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఏక్ మినీ క‌థ. ప్ర‌స్తుత ప‌రిస్థితుల రీత్య‌, ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి పద్ధ‌తిలో మే27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో విడుదల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఏక్ మినీ క‌థ ప్ర‌మోష‌న్ కంటెంట్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఏక్ మినీ క‌థ ట్రైల‌ర్ ని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, ఏక్ మినీ క‌థ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. 
 
శోభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వర్షం చిత్రం త‌న కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింద‌ని, ఈ మెముర‌బుల్ స‌క్సెస్ త‌న‌కు అందంచిన శోభ‌న్ గారికి నా ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు, ఇప్పడు శోభ‌న్ త‌న‌యుడు సంతోష్ శోభ‌న్ న‌టించిన ఏక్ మినీ క‌థ మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల అవుతుంది. ఈ సంద‌ర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేష‌న్స్ నిర్మాత‌ల‌కు, ఏక్ మినీ క‌థ చిత్ర బృందానికి నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను అని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పోస్ట్ చేశారు.
 
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్  రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ఏక్ మినీ కథ యూనిట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments