Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌, శ్రీలీల‌తో క్యాంపెయిన్‌ను డైరెక్ట్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (16:31 IST)
Allu Arjun, Srileela, Director Trivikram
తెలుగు నెంబ‌ర్ వ‌న్ ఓటీటీ మాధ్య‌మం ఆహా.. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఆహా ఒరిజిన‌ల్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, రియాలిటీ షోస్‌, టాక్ షోస్‌, కొరియ‌న్ డ్రామాస్‌, హాలీవుడ్ మూవీస్‌, డెయిలీ సీరియ‌ల్స్, పిల్ల‌ల కోసం ఆహా కిడ్స్‌, న్యూస్ అండ్ గేమింగ్ ఇలా అంద‌రీ మెప్పిస్తూ ముందుకు సాగుతోంది ఆహా. కుటుంబం, స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసే మ‌ధుర క్ష‌ణాల‌ను ఈ మాధ్య‌మం మ‌న ముందుకు తీసుకు వ‌స్తుంది. విభిన్న‌మైన భావోద్వేగాల‌ను ఈ ప్రపంచానికి అందిస్తోన్న ఆహా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, చార్మింగ్ స్టార్ శ్రీలీల‌తో ‘100% వెరైటీ, 100 తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’ క్యాంపెయినింగ్‌ను ప్రారంభించింది.  
 
మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో భారీ చిత్రాల‌ను రూపొందించ‌ట‌మే కాకుండా ఐకాన్ స్టార్‌తో ఇంత‌కు ముందు అల వైకుంఠ‌పుర‌ములో, జులాయి, సన్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ క్యాంపెయినింగ్‌ను డైరెక్ట్ చేశారు.ఆహాలోకి ఓ కొత్త ప్రేక్ష‌కుడు వ‌చ్చాడంటే, అది కేవ‌లం ఆ వ్య‌క్తిపైమాత్ర‌మే కాదు ..   ఆ కుటుంబంపై ఆహా గొప్ప ప్ర‌భావాన్ని చూపిస్తుంది. యాక్ష‌న్‌, రొమాన్స్‌, డాన్స్‌, డ్రామా.. ఇలా అన్నీ జోన‌ర్స్ బ్యాక్ డ్రాప్స్‌ల‌కు సంబంధించిన స‌న్నివేశాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆహా నిరంతరం క‌నెక్ట్ అవుతుంది. ఇది రోజువారీ జీవితంలో ఆహా యొక్క ప్రాముఖ్య‌త‌ను అందరికీ ఇంకా బ‌లంగా తెలియ‌జేస్తుంది. ఇప్పుడు ఆహా ప్రారంభించిన ఈ సరికొత్త క్యాంపెయినింగ్ ద్వారా ప్రేక్షకులందరూ వారి కుటుంబాల‌తో, స్నేహితుల‌తో క‌లిసి ఉండేలా ప్ర‌తీ క్ష‌ణాన్ని ఎంతో గొప్ప‌గా మార్చి వేస్తుంది ఆహా. 
 
ఈ సందర్భంగా ఆహాకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహాతో మరోసారి కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది. మూడేళ్ల ప్రయాణంలో ఆహా ఎంద‌రో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది. అందుకు కార‌ణం.. నిరంతరం వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందించ‌ట‌మే. డిఫరెంట్ ఎంట‌ర్‌టైన్మెంట్ కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికీ ఇదొక గ‌మ్య‌స్థానంగా మారింది. ఒక యాక్ట‌ర్‌గా ఆహా ఇంకా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బ‌ల‌మైన స్థానాన్ని ఏర్ప‌రుచుకోవాల‌ని కోరుకుంటున్నాను. మున్ముందు ఆహాతో ఈ అనుబంధం ఇంకా బ‌లంగా కొనసాగాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కుల సాధార‌ణ జీవితాల్లో భాగం కావ‌టానికి ఆహా ఎల‌ప్పుడూ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. వారి కంటెంట్‌ను 6 ఏళ్ల వ‌య‌సు నుంచి 65 ఏళ్ల వ‌య‌సున్న వారి వ‌ర‌కు వీక్షించ‌వ‌చ్చు. తాజాగా ఆహా ప్రారంభించిన 100 % వెరైటీ 100% తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క్యాంపెయినింగ్ ఆడియెన్స్ జీవితాల్లోకి మ‌రింత ఆనందాల‌ను తీసుకువ‌స్తుంది. ప్ర‌తీ కంటెంట్‌ను అందులో జోన‌ర్‌ను ఆవిష్క‌రించేలా ఈ క్యాంపెయినింగ్‌ను రూపొందించాం. మేం ఏం చెప్పాల‌నుకున్నామో ఆ క‌థ‌ను మ‌రింత స‌ర‌ళంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. మా ప్ర‌య‌త్నం ఇంకా బ‌లంగా, భావోద్వేగంగా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో నాటుకుపోతుంది’ అన్నారు. 
 
ఆహా సీఇఓ ర‌వికాంత్ స‌బ్న‌విష్ మాట్లాడుతూ ‘‘మేం ఇది వరకే అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామ‌ని చెప్పాం. ఇప్పుడు ప్రారంభించిన 100% వెరైటీ, 100% తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క్యాంపెయినింగ్ అనేది మా క‌మిట్‌మెంట్‌ను మ‌రింత పెంచింది. దాన్ని మేం ఇంకా గొప్ప‌గా నిల‌బెట్టుకుంటాం. ప్రేక్ష‌కుల ప్రాధాన్య‌త‌ల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వాలి. అది మా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా గొప్ప‌గా ఉంటూనే వారికి అర్థ‌మైయ్యేలా సుల‌భ‌త‌రంగా ఉండాలని మేం భావిస్తూనే ఉంటాం. మా వ‌ద్ద ల‌క్ష‌ల్లో ప్రేక్ష‌కులున్నారు. వారంద‌రికీ విభిన్నంగా వినోదాన్ని అందించేలా ఓ గ‌మ్యంలాగా మేం మారుతున్నాం. సినిమాలు, సీరియ‌ల్స్‌, వెబ్ సిరీస్‌, గేమ్స్ నుంచి న్యూస్ ఇలా ఏదైనా ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన వినోదం మా ద‌గ్గ‌రే ల‌భ్య‌మ‌వుతుంది’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments