Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు శంక‌ర్ సినిమాలో న‌టుడు - ఇప్పుడు సంగీతం ద‌ర్శ‌కుడయిన తమన్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:27 IST)
thaman-sankar-charan-sirish
రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీకి మోస్ట్‌ హ్యపెనింగ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్‌ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. 
 
శంకర్‌ రూపొందించిన 'బాయ్స్‌' సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురుచూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన 'వైశాలి` (ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం. "శంకర్‌గారు నిర్మించిన 'వైశాలి'(ఈరం)కి ట్యూన్స్‌ ఇచినప్పుడు, ఆయన తొలి వెంటనే మ్యూజిక్‌ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది" అని తమన్ గుర్తు చేసుకున్నారు.
 
ఇప్పటికే ఈ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ రికార్డింగ్‌ పనిని హైదరాబాద్‌లో ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు. ఈ పాటను రికార్డ్‌ చేయడానికి శంకర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ భారీ సాంగ్‌ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్‌చరణ్‌ కూడా భాగమయ్యారు. పాట విని చాలా ఎగ్జయిట్‌మెంట్‌కు ఫీలయ్యారు. ఈ భారీ బడ్జెట్‌ మూవీ దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments