Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్ ఆవిష్క‌రించిన‌ 'బాయ్స్' టీజర్ కు స్పంద‌న‌

సన్నీ లియోన్ ఆవిష్క‌రించిన‌ 'బాయ్స్' టీజర్ కు స్పంద‌న‌
, శుక్రవారం, 16 జులై 2021 (17:25 IST)
Sunny Leone, Boys Teaser
శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ఈ పాటను పాడారు. 
 
ఈ నేప‌థ్యంలో తాజాగా  సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుద‌ల చేసిన బాయ్స్ టీజ‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. బాయ్స్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ద‌యానంద్ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ ల‌వ్ స్టోరీగా రెడీ చేశార‌నే విష‌యం ఈ టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. డైన‌మిక్ లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. 
 
నటీనటులు: గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..
 
టెక్నికల్ టీమ్:  రచన, దర్శకత్వం: దయానంద్, నిర్మాత: మిత్రా శర్మ, సహ నిర్మాత: పడవల బాలచంద్ర, సంగీత దర్శకుడు: స్మరన్, గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్, లిరిక్స్: శ్రీమణి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్,  కొరియోగ్రఫీ: జావేద్,లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి, ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మ‌ల క‌థ‌తో మ‌హిళా టీమ్ చేస్తున్న‌ `అన్యాస్ టూటోరియ‌ల్`‌