Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి కొడుకు పెళ్లి: చరణ్-ఎన్టీఆర్‌లకు స్వాగతం పలికిన అనుష్క, ప్రభాస్

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (12:52 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కొడుకు కార్తికేయ వివాహం జైపూర్ స‌మీపంలోని కూకాస్‌లో ఉన్న ఓ స్టార్ హోట‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. కార్తికేయ పెళ్లి చేసుకోబోతుంది ఎవ‌రునో కాదు జ‌గ‌ప‌తి బాబు అన్న కూతుర్ని. ఆమె పేరు పూజ‌. కార్తికేయ‌, పూజ‌ల పెళ్లి ఈ నెల‌ 30న ముహుర్తంగా నిర్ణ‌యించారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం హీరోలంతా బ్యాగ్ సర్దుకొని జైపూర్ వెళ్లారు. ప్ర‌భాస్, అనుష్క అంద‌రి కంటే ముందుగా అక్క‌డ‌కి చేరుకున్నారు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు ప్ర‌భాస్, అనుష్క‌, రాజ‌మౌళి స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు. 
 
జ‌గ‌ప‌తి బాబు, రాజ‌మౌళి ఫ్యామిలీతో అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అందుచేత నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ వీరంద‌రూ కూడా జైపూర్ వెళుతున్నారు. రానా, నాని ఆల్రెడీ జైపూర్ చేరుకున్నారు. మ‌రి కొంత మంది హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సీనియ‌ర్ న‌టులు జైపూర్ వెళ్ల‌నున్నారు. అంతే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ పెళ్లికి హాజ‌రు కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాడనీ భర్తను చంపేసిన భార్య!

వైఎస్ జగన్‌ను హత్య చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్??

Chandrababu: ఆటోలో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- వీడియో వైరల్

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments