Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజాంలో ప్రభాస్ ఫిల్మ్ సలార్ ఏడు గంటల షోకు ఫస్ట్ టికెట్‌ కొన్న ఎస్ఎస్ రాజమౌళి

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (16:31 IST)
SS Rajamouli, Prabhas, prudhiviraj, naveen erneni
రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ సలార్- సీజ్ ఫైర్’  విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డొమస్టిక్, ఓవర్సీస్ ప్రాంతాలలో గ్రౌండ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించడానికి సిద్ధంగా వుంది.  
 
ప్రభాస్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి’ ని అందించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘సలార్’ ఫస్ట్ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. నైజాంలో సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ..."ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా. @ఎస్ఎస్ రాజమౌళి నైజంలో ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ #సలార్ ఫస్ట్ టిక్కెట్‌ను టీమ్, నిర్మాత నవీన్ యెర్నేని నుండి కొనుగోలు చేసారు. @MythriOfficial ద్వారా నైజాం విడుదల. బుకింగ్‌లు భారీ వేడుకలతో అతి త్వరలో గ్రాండ్ గా ఓపెన్ అవుతాయి’’ అని తెలియజేశారు
 
మేకర్స్ షేర్ చేసిన ఫోటోలో రాజమౌళి తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్, మైత్రీ నవీన్ యెర్నేని, హోంబలే  ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్‌ వున్నారు.  
 
హైదరాబాద్ RTC X రోడ్స్‌లోని సంధ్య 70 MMలో 7 AM షో కోసం రాజమౌళి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నైజాం అంతటా రికార్డ్ స్థాయి సెంటర్లలో సలార్ రిలీజ్ చేస్తున్నారు.
 
శృతి హాసన్, జగపతి బాబు ఇతర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments