Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ రూ.500 కోట్లు?

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోనే కార

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (17:25 IST)
దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోనే కారణం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి కలిసి తీసిన ఫోటోను జక్కన పోస్ట్ చేశాడు.

చెర్రీ, ఎన్టీఆర్‌లను చెరో పక్కన కూర్చోబెట్టి తీసిన ఫోటోను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. రాజమౌళి ఇద్దరికీ కథను వినిపించారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటుండగా.. ఇవన్నీ మీ ఊహకే వదిలేస్తున్నా అన్నట్లు ఈ ఫొటోకు రాజమౌళి క్యాప్షన్ పెట్టారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా.. చెర్రీ, ఎన్టీఆర్‌తో రాజమౌళి చేసే సినిమా ఏకంగా రూ.500కోట్లకు చేరుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. చెర్రీ, ఎన్టీఆర్‌లతో రాజమౌళి సినిమా చేస్తే అది కచ్చితంగా బాహుబలి బడ్జెట్‌ను మించి.. మల్టీస్టారర్‌కే మల్టీస్టారర్ అయిపోతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
స్టూడెంట్ నెంబర్1తో ఎన్టీఆర్‌కి స్టార్ డమ్ ప్రసాదించి, సింహాద్రి, యమదొంగతో డూపర్ హిట్‌లను అందించాడు.. జక్కన్న. అలాగే చెర్రీతో మగధీర సినిమా తీసి అదుర్స్ అనిపించుకున్నాడు.

ఇప్పటికే రాజమౌళి తన తదుపరి చిత్రం డి.వి.వి.దానయ్యకు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఏ హీరోతో చేస్తారని ఇంకా ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్-మిస్టర్ సితో కలిసి జక్కన్న సినిమా చేస్తారేమోనని సినీ జనం అనుకుంటున్నారు. ఒకవేళ సినిమా ఖరారైతే 2018 జూన్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments