Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు... 30 భాషల్లో రిలీజ్‌కు ప్లాన్?

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:35 IST)
"ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
దీనికి కారణం లేకపోలేదు. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం రూ.1250 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. దీంతో రాజమౌళి చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అదేసమయంలో సినిమాకు భారీ బడ్జెట్ పెట్టేందుకు కూడా నిర్మాతలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 
 
అయితే, నిర్మాతకు నష్టాలు రాకుండా పక్కాగా ప్లాన్ చేసే దర్శకుడు రాజమౌళి... రూ.1000 కోట్ల బడ్జెట్‌తో చేపట్టే ప్రాజెక్టుకు కూడా పక్కాగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ముందుగా మార్కెటింగ్ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమై, ఓటీటీ ఫ్లాట్‌లతో ఆయన చర్చలు జరుపుతున్నారు. 
 
అదేసమయంలో రాజమౌళి ఇప్పటివరకు నిర్మించిన చిత్రాల్లో "బాహుబలి", "బాహుబలి 2", "ఆర్ఆర్ఆర్" వంటి చిత్రాలు పాన్ ఇండియా మూవీలుగా విడుదలై సంచలన విజయాలను నమోదు చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments