Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" రిలీజ్‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదు : రాజమౌళి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (15:05 IST)
"ఆర్ఆర్ఆర్" చిత్రం వచ్చే యేడాది జనవరి 7వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలోనే కాకుండా పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా, రాజధాని ఢిల్లీలో థియేటర్లు మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు థియేటర్లు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 
 
మహారాష్ట్రలో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుతున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ప్యూను అమలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఆ సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఈ చిత్రం మరోమారు వాయిదాపడొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
దీనిపై ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీన అనుకున్నట్టుగానే రిలీజ్ చేస్తున్నాం. వాయిదా వేసే ప్రసక్తే లేదు అని బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్‌తో చెప్పినట్టు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇది ఆర్ఆర్ఆర్ వాయిదాపడుతుందేమోనన్న ఆందోళనలో ఉన్న అభిమానులకు ఓ మంచి శుభవార్త అని చెప్పాలి. 

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments