అంతఃపురం'లో రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (13:42 IST)
Rashi Khanna
అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో... రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. 'అంతఃపురం'లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న 'అంతఃపురం' సినిమా చూసి తెలుసుకోవాలి. తెలుగులో హిట్ సినిమాలు చేసిన రాశీ ఖన్నాఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశారు. ఆల్రెడీ రిలీజైన ట్రైల‌ర్‌, సాంగ్స్‌లో అందంగా, అదే సమయంలో అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర చేశార‌ని తెలుస్తోంది. రాశీ ఖన్నా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
రాశీ ఖన్నా ఓ కథానాయికగా, ఆర్యకు జంటగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. సుందర్ .సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో 'అంతఃపురం' పేరుతో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ సమర్పణలో, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది.
 
సుందర్ సి మాట్లాడుతూ "మా 'అరణ్మణై' ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో 'చంద్రకళ', 'కళావతి'గా విడుదలై విజయాలు సాధించాయి. ఇప్పుడీ 'అంతఃపురం' కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీసినిమా. 'అంతఃపురం'లో‌ గ్రాండియర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments