Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున కోసమే శ్రీముఖి తప్పుకుందా?

Webdunia
శనివారం, 18 మే 2019 (16:14 IST)
తెలుగులో బుల్లితెర యాంకర్లు అనసూయ, సుమ, రేష్మీల తర్వాత అంతటి పాపుల అయిన యాంకర్ శ్రీముఖి. ఈమె బుల్లితెరకు మరింత గ్లామర్ తీసుకొచ్చిన ముద్దుగుమ్మ. బుల్లితెరపై ఆమె చేసే అల్లరి యూత్‌కి విపరీతంగా నచ్చుతుంది. ఫలితంగానే ఆమె చేస్తున్న పటాస్ ప్రోగ్రామ్‌ మంచి పాపులర్ అయింది. 
 
నిజానికి ఈ కార్యక్రమాన్నిశ్రీముఖి కోసమే చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంది. ఈ వార్త వినగానే ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశకు లోనయ్యారు.
 
ఆమె ఇలా హఠాత్తుగా బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. 'బిగ్ బాస్-3' సీజన్‌లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది తాజా సమాచారం. 
 
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. సో.. శ్రీముఖి అల్లరి బిగ్ బాస్ హౌస్‌లో ఇకపై వంద రోజుల పాటు చూడొచ్చన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments