Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (16:34 IST)
తన భర్త శ్రీహరికి దానం గుణం ఎక్కువ అని, అనేక మందికి దానం చేశాడని, అయితే, మమ్మల్ని కొందరు మోసం చేశారని ఆయన భార్య, సినీనటి డిస్కోశాంతి అన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమాలలో యాక్షన్ సన్నివేశాలలో డూప్ లేకుండా చేసేవారు. నేను సెట్‌కి వస్తున్నాని తెలిస్తే ముందుగానే రిస్కీ షాట్లు తీసేయమని డైరక్టర్స్‌తో చెప్పేవారన్నారు. ఒకసారి ఒక డైరెక్టర్ ఆయనను పెద్ద బిల్డింగ్‌పై నుంచి రెండుసార్లు దూకించాడు. అంతే నేను వెళ్లి ఆ డైరెక్టర్‌ను, ఫైట్ మాస్టర్‌ను చీవాట్లు పెట్టాను. అయితే, తెరపై ఆయన యాక్షన్ సీన్స్‌ను చూస్తూ ఎంజాయ్ చేసేదానిని. చూడటానికి ఆయన అలా కనిపిస్తారుగానీ సాయం చేసే గుణం ఎక్కువ అని అన్నారు. 
 
బావ బాగానే సంపాదించారు. అయితే, ఆయన చపోయిన తర్వాత కొందరు మమ్మల్ని మోసం చేశారు, అలా సగం ఆస్తులను కోల్పోయామనే చెప్పాలి. ఆయన బాగా నమ్మిన స్నేహితులే అలా చేశారు. అది ఆస్తులను గురించి ఆలోచన చేసే సమయం కాదు. అందువల్ల నా నగలు తాకట్టు పెట్టి ఇల్లు గడిచేలా చూశాను. శ్రీహరి చేసిన దాన ధర్మాలు వలన పుణ్యమే మమ్మల్ని కాపాడుతుందని నమ్ముతాను. మమ్మల్ని మోసం చేసేవారి సంగతి అంటారా.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments