Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో'.. శ్రీదేవిపై రాంగోపాల్ వర్మ ట్వీట్

నటి శ్రీదేవి మృతి కేసు నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంకా బయటపడలేదు. ఆమె జ్ఞాపకాలతోనే ఆయన ఇంకా గడుపుతున్నాడు. ఈనెల 24వ తేదీ రాత్రి శనివారం రాత్రి శ్రీదేవి మరణించినట్టు వార్త తెలియగానే రాంగో

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:09 IST)
నటి శ్రీదేవి మృతి కేసు నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంకా బయటపడలేదు. ఆమె జ్ఞాపకాలతోనే ఆయన ఇంకా గడుపుతున్నాడు. ఈనెల 24వ తేదీ రాత్రి శనివారం రాత్రి శ్రీదేవి మరణించినట్టు వార్త తెలియగానే రాంగోపాల్ వర్మ దుఃఖిస్తూ తన ఆరాధ్య దేవత ఇక లేదంటూ ట్వీట్ చేశారు. అంతేనా, అందాల జాబిలిని ఇంతత్వరగా తీసుకెళ్లిన దేవుడిని ద్వేషిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. 
 
అయితే, శ్రీదేవి చనిపోయి నాలుగు రోజులు అవుతున్నా... ఆ విషాదం నుంచి రాంగోపాల్ వర్మ మాత్రం ఇంకా తేరుకోలేదు. తాజాగా తన అభిమాన నటిని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశాడు. 'గోవిందా గోవిందా' సినిమాలో 'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో' అంటూ నాగార్జున పాడే పాట... శ్రీదేవిని కీర్తించడంలో అత్యున్నతమైనదన్నాడు. 
 
శ్రీదేవిని పుట్టించినందుకు బ్రహ్మను కీర్తిస్తూ పాడే పాట అది. అయితే, అదే పాటను అంత్యక్రియలకు కూడా వాడతారనే విషయాన్ని తాను ఎన్నడూ ఊహించలేకపోయానని రాంగోపాల్ వర్మ చేసిన తాజా ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు, కింగ్ నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు. 'అనుకున్నామని అన్నీ జరగవు... అనుకోలేదని కొన్ని ఆగవు' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కేశినేని నాని..?

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments