Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతి పట్ల కమల్ హాసన్ ఏమన్నారు? ఆ లాలి పాట?

శ్రీదేవి మృతిపట్ల తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క‌మల్ హాస‌న్‌, శ్రీ‌దేవి త‌మిళ తెర‌పై సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌‌గా గుర్తింపు సంపాదించారు. ఎన్నో హిట్ చిత్రాల్ల

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (18:03 IST)
శ్రీదేవి మృతిపట్ల తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క‌మల్ హాస‌న్‌, శ్రీ‌దేవి త‌మిళ తెర‌పై సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌‌గా గుర్తింపు సంపాదించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. త‌న‌కు హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ‌దేవి అకాల మృతిపై క‌మ‌ల్ హాసన్ షాక్ అయ్యారు. 
 
శ్రీదేవి అందం, అభినయాన్ని కొనియాడారు. సినీ ఇండస్ట్రీలో ఆమెతో తన జర్నీ కొన్ని సంవత్సరాలు సాగిందని.. ఆమె బాలీవుడ్‌కు వెళ్ళడంతో.. వేర్వేరు దారుల్లో తమ ప్రయాణం మారిపోయిందని.. కానీ లెజెండ్ కళాకారిణిని కోల్పోయామని కమల్ హాసన్ ఆవేదనను వ్యక్తం చేశారు. 
 
శ్రీ‌దేవి యువ‌తిగా ఉన్న ద‌శ నుంచి మ‌హిళ‌గా మారిన దశ వరకు ఆమె తనకు తెలుసునని కమల్ చెప్పారు. ఆమె త‌న‌కు ద‌క్కిన స్టార్ డ‌మ్‌కు అన్ని విధాలా అర్హురాలు. ఇప్పుడైతే స‌ద్మా (వ‌సంత కోకిల‌)లోని లాలి పాట వెంటాడుతోంది. మ‌న‌మంతా త‌న‌ని మిస్ అయ్యామని ట్విట్టర్‌లో చెప్పారు. మీడియా ముందు ఆమె గొప్పదనాన్ని కొనియాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా శ్రీదేవి మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments