Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీ పునాదులు స్ట్రాంగ్‌గా వేస్తున్నా .. దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే : రజనీకాంత్

తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ స్థాపనలో భాగంగా, పునాదులు గట్టిగా వేస్తున్నట్టు చెప్పారు.

Advertiesment
పార్టీ పునాదులు స్ట్రాంగ్‌గా వేస్తున్నా .. దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే : రజనీకాంత్
, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (13:55 IST)
తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ స్థాపనలో భాగంగా, పునాదులు గట్టిగా వేస్తున్నట్టు చెప్పారు. 
 
శుక్రవారం ఉదయం తన అభిమానులతో చెన్నైలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తాను గట్టిగా పునాదులు వేసుకుని రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే, నిజాయతీ, క్రమశిక్షణే తనకు, తన కార్యకర్తలకూ బలమని చెప్పారు. గెలుపు, ఓటములను గురించి తాను ఆలోచించదలచుకోవడం లేదని, అవసలు ముఖ్యమే కాదన్నారు. 
 
ఇకపోతే, సహచర నటుడు కమల్ రాజకీయ ఆరంగేట్రంపై ఆయన స్పందిస్తూ, మదురై బహిరంగ సభను తాను చూశానని.. చాల బాగా జరిగిందని ప్రశంసించారు. అయితే తమ దారులు వేరని.. లక్ష్యం మాత్రం ఒకటేనని ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యం అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీ షాపులోని అమ్మాయిని ఎత్తుకెళ్లి ఎలా ఏం చేస్తున్నాడో చూడండి (వీడియో)