Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలికి శ్రీదేవి నో చెప్ప‌డానికి కార‌ణం చెప్పిన వర్మ

తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ ఎంత అద్భుతంగా న‌టించిందో అంద‌రికీ తెలిసిందే. అస‌లు... ఈ పాత్ర‌కు ముందుగా అతిలోక

Webdunia
మంగళవారం, 1 మే 2018 (12:41 IST)
తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ ఎంత అద్భుతంగా న‌టించిందో అంద‌రికీ తెలిసిందే. అస‌లు... ఈ పాత్ర‌కు ముందుగా అతిలోక సుంద‌రి శ్రీదేవిని అనుకోవ‌డం.. ఆమె అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ర‌మ్య‌కృష్ణ‌ను సంప్ర‌దించ‌డం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. 
 
ఇప్పుడు ఈ విష‌యం గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.
అది ఏంటంటే... 'బాహుబలి' సినిమాలో శ్రీదేవి ఎందుకు నటించలేదో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వివ‌రించారు. దీనికంతటికి కారణం శ్రీదేవి భర్త బోనీ కపూరే అని తెలిపారు. 
 
తాను ఆ సమయంలో శ్రీదేవితో స్వయంగా మాట్లాడానని... గొప్ప సినిమా అని, అవకాశం వదులుకోవద్దని చెప్పానని... నేను అలా చెప్ప‌డంతో శ్రీదేవి ఆసక్తి కూడా చూపింది. కానీ, బోనీకి మాత్రం ఇష్టం లేదని... దీంతో, రెమ్యునరేషన్‌ను భారీగా డిమాండ్ చేసి, 'బాహుబలి'లో శ్రీదేవి నటించకుండా చేశారని తెలిపారు. బోనీ కపూర్ నిర్ణయాల వల్ల కెరీర్ పరంగా శ్రీదేవి చాలా నష్టపోయారని చెప్పారు. మ‌రి...వ‌ర్మ మాట‌ల గురించి బోనీ స్పందిస్తారేమో చూడాలి..!
 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments