Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సింహ కోడూరి నటించిన భాగ్ సాలే చిత్రం జులై 7న విడుదల

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (16:53 IST)
Sri Simha Koduri, Neha Solanki
ప్రేక్షకులను వినూత్నమైన కథలతో ఆకట్టుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు శ్రీ సింహ కోడూరి. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న 'భాగ్ సాలే' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.
 
ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచిన ఈ సినిమా జూలై 7న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.
 
అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేహా సోలంకీ, రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
 
ఈ సినిమాకు సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకొంటోంది.
 
నటీనటులు : శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments