Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి మరో సంచలనం.. కంగన రనౌత్‌పై విరుచుకుపడ్డ కాంట్రవర్సీ క్వీన్..

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (18:50 IST)
శ్రీరెడ్డి మ‌రోసారి రెచ్చిపోయింది... కాకపోతే ఎప్పుడూ పురుష పుంగవులపై నోరు పారేసుకునే అమ్మడు ఈసారి సాటి మహిళపై నోరు పారేసుకోవడం అది కూడా.. ఏకంగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ న‌టి కంగ‌న ర‌నౌత్‌ని గురించి నోరు పారేస్కుంటూ... ఎంత మాటొస్తే అంతా మాట్లాడేసింది. ఓ వైపు ఆవిడ త‌న‌కు ఇష్ట‌మైన న‌టి అంటూనే... మ‌రోవైపు వేయాల్సిన నాలుగు అక్షింత‌లు కూడా వేసేసింది శ్రీరెడ్డి. 
 
సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలాసార్లు త‌న‌కు ఇష్ట‌మైన న‌టి.. ఆద‌ర్శ‌వంత‌మైన న‌టీమ‌ణి కంగ‌న రనౌత్ అని చెప్పిన శ్రీ రెడ్డి... కంగ‌నా రనౌత్‌ను ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగనా న‌టించ‌నుండటంతో ఇప్పుడు ఈమెపై సోష‌ల్ మీడియాలో మ‌రింత‌గా రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ‌... తాను కంగనా రనౌత్‌ను గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాననీ.. అవి తెలిసిన త‌ర్వాత అస‌లు ఆమె మేడమ్ జయలలిత పాత్రలో నటించేందుకు అర్హురాలు కాదంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.
 
ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ బ‌యోపిక్‌లో... కంగనా ర‌నౌత్ న‌టించనుందని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేసారు. దాంతో ఇప్పుడు కంగ‌నాకు అంత అర్హ‌త లేద‌నీ.. అస‌లు ఆ పాత్ర‌లో న‌టించ‌డం మంచిది కాద‌ని శ్రీరెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించేసింది. అస‌లు కంగ‌నాను ఆ పాత్ర‌కు ఎంపిక చేసి చాలా త‌ప్పు చేసార‌ని విమ‌ర్శించిన శ్రీరెడ్డి... కంగ‌నా సౌత్ ఇండ‌స్ట్రీ గురించి త‌ప్పుగా మాట్లాడుతోంద‌నీ.. ముందు ఆ చెత్త వాగుడు ఆపితే బాగుంటుంద‌ని హెచ్చరికలు కూడా జారీ చేసేసింది.
 
మొత్తానికి ఇన్నాళ్లూ టాలీవుడ్‌లోని హీరోలను గురించి నోరు పారేసుకున్న శ్రీరెడ్డి... ఇప్పుడు తాజాగా కంగ‌న ర‌నౌత్‌పై చేసిన కామెంట్స్ మళ్లీ సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments