ఆమె పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను... లేడీ సూపర్‌స్టార్‌పై శ్రీరెడ్డి కామెంట్స్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:00 IST)
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార కెరీర్ చాలా అద్భుతంగా కొనసాగుతోంది. ఆమె చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటోంది. గతంలో శింబుతో ప్రేమలో మునిగి తేలిన ఈ బ్యూటీ, బ్రేకప్ తర్వాత పెళ్లయిన ప్రభుదేవాపై మనసుపడ్డారు. అప్పట్లో పెళ్లి వరకు వచ్చిన వీరి ప్రేమాయణం అనుకోని అవాంతరాల వలన చివరి నిమిషంలో ఆగిపోయింది. ప్రస్తుతం నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
 
ఇటీవల తమిళంలో సీనియర్ నటుడు రాధారవి నయనతారను కించపరిచే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. ‘‘వావ్..అవును రాధారవి... ఆమె డెవిల్... కానీ మీరన్నట్లు కాదు, కష్టపడి పని చేయడంలో డెవిల్.. అందంలో దేవత.. నయనతార పెళ్లి కోసం ఎదురుచేస్తున్నాను.'' అంటూ కౌంటరిచ్చారు. 
 
శ్రీరెడ్డి ఈ జంటకు మాత్రమే కాకుండా రిలేషన్లో ఉన్న బాలీవుడ్ జంట మలైకా అరోరా-అర్జున్ కపూర్ లాంటి వారికి మద్దతు ఇస్తున్నారు. నయనతార, ప్రియుడు విఘ్నేష్ శివన్‌ల ఫోటోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన ‘నేనూ రౌడీనే' సినిమాలో నటించిన సమయం నుండి నయనతార అతనితో లవ్ రిలేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments