Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబు మూవీకి ఆ యంగ్ డైరెక్ట‌ర్ అంత తీసుకున్నాడా?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:30 IST)
అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్. అతడు దర్శకత్వం వహించిన గత చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలవడంతో ఆయన తదుపరి చిత్రాలపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ మరియు ఎఫ్ 2 సినిమాల భారీ సక్సెస్‌తో అనిల్ ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. 
 
మహేష్ ప్రస్తుతం నటిస్తున్న మహర్షి చిత్రం పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ, సినిమా ప్రస్తుతం క్రియేటివ్ డిఫెరెన్స్ వచ్చిన నేపథ్యంలో ఆ చిత్రం నిలిచిపోయిందని మహేష్ తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికి, చివ‌రికి బాల్ అనీల్ రావిపూడి కోర్టులోకి వ‌చ్చి ప‌డింది. 
 
మహర్షి సినిమా రిలీజ్ తర్వాత మహేష్ 26వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అనిల్ రావిపూడి 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడని ఫిలింనగర్ టాక్. మహేష్ చిత్రం ఎలాగోలా భారీ బిజినెస్ చేస్తుంది కాబట్టి నిర్మాతలు సైతం అనిల్ అడిగినంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. 
 
మహేష్ నటించే 26వ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రష్మిక మంథాన, అదితిరావు హైదరి చిత్రం కథానాయికలుగా నటించనున్నట్లు తెలుస్తోంది. 2020లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments