Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెర్సీ ఎలా ఉంటుందో ముందే చెప్పేసిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (22:08 IST)
అందంలో అభినయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలితో దూసుకొస్తోన్న ప్రతిభావంతురాలైన కన్నడ నటి 'శ్రద్ధ శ్రీనాథ్'. 'జెర్సీ' సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ కన్నడ బ్యూటీ. నేచురల్ స్టార్ నాని హీరోగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న 'జెర్సీ' సినిమాతో ఈ నెల ‌19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్లో శ్ర‌ద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ... 'జెర్సీ' సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల శ్రద్ధ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగ‌ల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో టీనేజర్‌గా మరియు ఒక మదర్‌గా ఇలా వేరువేరు దశలలో కనిపిస్తానని తెలిపింది.
 
ఇక నాని పక్కన నటించడం గురించి చెప్తూ.. నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలా సింపుల్ వే‌లో చక్కని హావభావాలతో నటిస్తారని.. ఆయన పక్కన నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని.. అదేవిధంగా ఈ సినిమా ఒప్పుకోవడానికి నానితో పాటుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, అనిరుధ్‌లతో మొత్తం చిత్ర బృందం కూడా కారణమని.. వారి పనితనం వల్లే 'జెర్సీ' సినిమా అమోఘమైన భావోద్వేగాలతో అద్భుతంగా వచ్చిందని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పుకొచ్చింది. కాగా కొన్ని సంవత్సరాలు పాటు హైదరాబాద్‌లోనే పెరిగిన శ్రద్ధ.. ఇప్పటికే పలు కన్నడ మరియు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments