Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో రిలీజ్ కానున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:59 IST)
కిరణ్ అబ్బవరం - ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందిన చిత్రం 'ఎస్.ఆర్.కల్యాణ మండపం'. ఈ నెల 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సాయికుమార్ కీలకమైన పాత్రను పోషించారు. నిర్మాతలు ప్రమోద్ - రాజు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.
 
అయితే, ఆ వారంలో విడుదలైన కొత్త చిత్రాల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. అయితే అదే ఊపును మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తుందనే దర్శక నిర్మాతల అంచనాలు తప్పాయి. కొద్దిపాటి లాభాలతో సినిమా ఓకే అనిపించుకుంది. ఆ సినిమాను ఇప్పుడు ఓటీటీ ద్వారా వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈ సినిమా ఓటీటీ హక్కులు 'ఆహా' సంస్థ సొంతం చేసుకుంది. సాధ్యమైనంత త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారని అంటున్నారు. 'ఆహా' నుంచి స్ట్రీమింగ్ డేట్ రానున్నట్టుగా చెబుతున్నారు. ప్రేమ, యాక్షన్, ఎమోషన్‌తో కూడిన ఈ సినిమా 'ఆహా'లో ఏ మేరకు రేటింగ్ సాధిస్తుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments