Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి రూపాయల సెట్.. 80 మంది డ్యాన్సర్లతో చిందులేయనున్న స్పైడర్‌

బ్రహ్మోత్సవం ఫట్ అయ్యాక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. స్పైడర్‌తో ముందుకు రాబోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న స్పైడ‌ర్ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రీష్ జై

Webdunia
శనివారం, 1 జులై 2017 (13:34 IST)
బ్రహ్మోత్సవం ఫట్ అయ్యాక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. స్పైడర్‌తో ముందుకు రాబోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న స్పైడ‌ర్ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎస్ జె సూర్య విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాలని మహేష్ ఉవ్విళ్లూరుతున్నాడు. తమిళంలోనూ మాస్ హీరో అయిపోవాలనుకుంటున్నాడు.
 
తాజాగా మహేష్-మురగదాస్ సినిమా షూటింగ్‌ పూర్తైనా.. ఇంకా రెండు పాటలు మిగిలిపోయాయి. ఈ పాటలతో పాటు టాకీ పార్ట్‌ను పూర్తి చేసేందుకు మహేష్ బాబు మురుగదాస్ టీమ్‌తో వచ్చేవారంలో కలవనున్నాడు. జూలై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పైడర్ సాంగ్ చిత్రీకరణ.. అన్న‌పూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో జరుగనుంది. ఇందుకోసం కోటి రూపాయల ఖర్చుతో అద్భుతమైన సెట్ వేశారు. 
 
ఈ పాటకు సోభి కొరియోగ్రాఫ్ చేయ‌నుండ‌గా, ఇందులో మ‌హేష్‌తో కలిసి 80 మంది డ్యాన్స‌ర్స్ పాల్గొంటారట. ఇక మ‌రో సాంగ్‌ని ఆగ‌స్టులో షూట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, సినిమాని సెప్టెంబ‌ర్ 27న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్.. కాస్త గ్యాప్ తీసుకుని స్పైడర్ పాటల షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments