Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబీపై అసహనం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు న

Webdunia
శనివారం, 1 జులై 2017 (10:30 IST)
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. బాబీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నాడు బాబీ. 
 
ఎలాంటి హడావుడి పడకుండా అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కిస్తున్నాడు. దీంతో షూటింగ్ కాస్త నెమ్మ‌దిగా సాగుతోంద‌ట‌. షూటింగ్ కాస్త లేటు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌మ‌ని, ఎలాగైనా సెప్టెంబ‌ర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేయాలని బాబీతో ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. జై లవకుశ సినిమా టీజర్, కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు బాబీ, కల్యాణ్ రాం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ ఎడిటర్ గణేష్‌పై వాళ్లు అనుమానం వ్యక్తం చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. లీకేజీ వెనుక ఇంకా ఎవరెవ‌రు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments