Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాలోకి క్యూ కట్టిన హీరోయిన్లు?

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (08:48 IST)
దక్షిణ భారతంలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సినీ సెలెబ్రిటీలపై కన్నేసింది. ముఖ్యంగా, గ్లామర్ ఉన్న హీరోయిన్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని చూస్తోంది. తద్వారా తమిళనాడులో ఎలాగైనా అడుగిడాలని చూస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా చేరికలపై దృష్టిసారించింది.
 
ప్రజాకర్షణ కలిగిన నేతలు, సినీ తారలను ఆహ్వానించడం ద్వారా పార్టీకి అదనపు ఆకర్షణ తీసుకురావాలని యోచిస్తోంది. ఇదే అంశంపై సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో సీనియర్ మహిళా నటులు వాణీవిశ్వనాథ్, ప్రియారామన్‌‌లతో వేర్వేరుగా భేటీ అయిన బీజేపీ ఏపీ కార్యాలయ ఇన్‌ఛార్జ్ సత్యమూర్తి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
పార్టీ బలోపేతానికి సహకరిస్తే 2024 ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని, అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఇందుకు వారు ఓకే అన్నట్టు  సమాచారం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో చర్చించిన అనంతరం వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌లు అధికారికంగా బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. 
 
పైగా, వీరికి దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఛరిష్మా ఉన్నందున పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. అదేసమయంలో త్వరలో జరుగనున్న తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రచారం చేయాలని కోరారు. ఇందుకు ఇద్దరు నటీమణులు సుముఖత వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments