Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ గురించి తెలియదా? తమన్నాను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (12:25 IST)
కోలీవుడ్ మెర్సల్ హీరో విజయ్ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్లు ప్రస్తుతం వివాదానికి తెచ్చిపెట్టాయి. విజయ్ గురించి తనకు తెలియదంటూ తమన్నా చేసిన వ్యాఖ్యలు విజయ్ ఫ్యాన్స్‌ను హర్ట్ అయ్యేలా చేశాయి. దీంతో మిల్కీ బ్యూటీ తమన్నాపై తమిళ అగ్ర హీరో విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌కు తమన్నా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ ఫ్యాన్స్ ప్రస్తుతం తమన్నాను ట్రోల్ చేస్తున్నారు.
 
ఇటీవల 'పెట్రోమాక్స్' ప్రమోషన్ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నాకు హీరో విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. ''విజయ్ గురించి మీ స్పందన ఏంటి?" అంటూ తమన్నాను యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన తమన్నా.. "ఆయన గురించి నాకేం తెలియదు. ఒక సినిమాలో ఆయనతో కలిసి నటించాను.

కానీ, ఆ సమయంలో ఆయనకు, నాకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు. ఆయన పనేదో ఆయనది అన్నట్టు ఉండేవారు. షూటింగ్‌కు వెళ్లామా? వచ్చామా? అన్నట్టు ఉండేది. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. ఆయన గురించి ఏమీ తెలియకుండా కామెంట్ చేయలేను" అంటూ కామెంట్స్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments