Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సోనీ చరిష్టా

Webdunia
శనివారం, 18 మే 2019 (09:21 IST)
బాలీవుడ్ నటీమణుల్లో సోనీ చరిష్టా ఒకరు. ఈమె తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పైగా, ఇతర హీరోయిన్లకూ తీసిపోని అందం, అభినయం ఆమె సొంతం. అలా ఆమెకు అన్నివున్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడంలేదు. అందుకే సౌత్ మూవీ ఇండస్ట్రీపై దృష్టిసారించింది. 
 
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి (కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి), కళాతపస్వి కె.విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఫరీన్ ఫాతిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి తెలుగులో 'ఇద్దరు' అనే పేరు పెట్టినట్టు సమాచారం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, గోవా, థాయిలాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న 'ఇద్దరు' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు థ్రిల్లింగ్ అంశాలతో సాగే హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న 'ఇద్దరు' చిత్రం తనకు మరింత పేరు తెస్తుందని ఆశిస్తున్నానని సోనీ చెబుతోంది.
 
ఈ చిత్రం కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నానని, తెలుగులో త్వరలోనే ఒక మంచి సినిమాకు సైన్ చేయనున్నానని సోనీ తెలిపారు. ఈ చిత్రంలో హేమాహేమీలతో నటించడం చాలా గర్వంగా ఉందని, చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. సమీర్, నిర్మాత ఫరీన్ ఫాతిమాలకు తాను ఎప్పటికి రుణపడి ఉంటానని సోనీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments