Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరికొత్తగా 'స్వయంవద' (మూవీ రివ్యూ)

Advertiesment
సరికొత్తగా 'స్వయంవద' (మూవీ రివ్యూ)
, శుక్రవారం, 17 మే 2019 (17:19 IST)
నటీనటులు: అనికా రావు, ఆదిత్య అల్లూరి, అర్చనా కౌడ్లీ, పోసాని కృష్ణ మురళి, ధన్‌రాజ్‌, సారికా రామచంద్రరావు, రాంజగన్‌, లోహిత్‌ కుమార్‌, ఆనంద చక్రపాణి, ఆర్తి మోహ్‌ రాజ్‌, హిమాంశ రాజ్‌, ఉమాంత కల్ప,  సోనీ హేమంత్‌ మీనన్‌, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష.
 
సాంకేతివర్గం: కెమెరా:  వేణు మురళీధర్‌.వి,  సంగీతం: రమణ.జీవి, ఎడిటింగ్‌:  సెల్వ కుమార్‌, నిర్మాత:  రాజా దూర్వాసుల, కథ,మాటలు, కథనం, దర్శకత్వం: వివేక్‌ వర్మ. 
 
ఈ మధ్య హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిత్ర చిత్రానికి ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్న దర్శక నిర్మాతలు లాగానే ఈసారి వివేక్‌ వర్మ అన్నీ తానై ఈ చిత్రాన్ని చేశాడు. "స్వయంవద" అనే చక్కటి టైటిల్‌తో ముందుకు వచ్చాడు. పాత కొత్త కలయికతో తీసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ : 
స్వయంవధ (అనికారావు) ఓ యువతి. తండ్రి విక్రమ్‌ రెడ్డి (లోహిత్‌ కుమార్‌) అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. పెంపకంకారణంగా అన్నీ తననుకున్నట్లే జరగాలనే మనస్తత్వం ఆమెది. ఆమె రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా వేషాలు వేసినా సహించదు. ఇంత పద్ధతిగా వుండే స్వయంవద తన తండ్రి దగ్గర పనిచేసే పోసాని కొడుకు సుబ్బారావును (ఆదిత్య అల్లూరి) ఇష్టపడుతుంది. ఆఖరికి కూతురు కోరికమేరకు సుబ్బుతో పెళ్లికి సరేనంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్‌. స్వయంవద పద్ధతి సుబ్బారావుకు నచ్చదు. దాంతో తప్పించుకోవాలని తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని తేల్చిచెబుతాడు. మొదటినుంచీ అహంతో ప్రవర్తించే స్వయంవద తన లైఫ్‌ విషయానికి వచ్చేసరికి ఊరుకుంటుందా! ఉగ్రురాలైపోతుంది. ఆ తర్వాత సుబ్బారావును ఏమిచేసింది? తర్వాత కథేమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
 
విశ్లేషణ:
ఇది డైరెక్టర్‌ మూవీగా చెప్పవచ్చు. మొదటి చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా మలిచేలా చేశాడు. అంతా కొత్తవారు కావడంతో తగినంత పబ్లిసిటీతో ముందుకు సాగాడు. స్వయంవద పాత్రను అవికారావు బాగా పండించింది. హారర్‌ సప్సెన్స్‌ అంశాలను వినోదం కీలకం. దాని తగిన మోతాదులో చూపించాడనే చెప్పాలి. మొదటినుంచీ చెబుతున్నట్లు చారిత్రక నేపథ్యానికి వర్తమానికి లింకుతో ఈ కథను తయారుచేశారు. ఆ క్రమంలో చక్కటి సందేశం ఇచ్చాడు. నెగిటివ్‌ ఆలోచన మనిషికి ఎంత ప్రమాదకరమో వెల్లడించాడు. అహంభావిగా అనికారావు సహజంగా నటించింది. 
 
భయానక సన్నివేశాల్లో ఆమె చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ప్రియంవద పాత్రలో పూర్తిభిన్నమైన స్వభావంతో నటించి మెప్పించింది. ఆదిత్య అల్లూరి తన పాత్ర పరిధిమేరకు బాగానే నటించాడు. ప్రతికూల ఆలోచనలు గల తండ్రిగా లోహిత్‌ కుమార్‌ ఆకట్టుకుంటే కొడుకు కోసం తపించే తండ్రిగా పోసాని నటన రక్తి కట్టించింది. ఇక మూడు పాత్రల్లో నటించిన ధన్‌రాజ్‌ తన పూర్తిస్థాయి నటన చూపించారు. ఇంతకుముందు 12 పాత్రలు వేసి పనిలేని పులిరాజుకంటే ఈ చిత్రంలో మెప్పించాడు. వేణు మురళీధర్‌.వి కెమెరా పనితనం, రమణ.జీవి పాటలు, నేపథ్య సంగీతం వినసొంపుగా సాగాయి. సెల్వ కుమార్‌ ఎడిటింగ్‌ పనితనం కనిపించింది.
 
ఏది ఏమైనా హారర్‌ చిత్రాలంటే ఒకే ఫార్ములాలో వుంటాయి. వాటికి కాస్త భిన్నంగా ఆలోచించి కుటుంబ కథతో ముడివేస్తూ దర్శకడు మలిచిన తీరు బాగుంది. చిన్నపాటి లోపాలున్నా దాన్ని అధిగమిస్తూ సస్పెన్స్‌ ప్రేక్షకుల్ని కట్టడిచేసే ప్రయత్నం చేశాడు. సందేశాత్మకంగా, వినోదాత్మకంగా సరికొత్త చిత్రంగా అలరిస్తుంది. ఇలాంటి చిత్రాన్ని మరింత  పబ్లిసిటీ ఇస్తే మరింతగా ప్రేక్షకులకు చేరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూత్‌ను ఆలోచింపజేసే అల్లు శిరీష్ "ఏబీసీడీ"