Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క, సమంత స్ఫూర్తితో నటించా: అనికా రావు

Advertiesment
అనుష్క, సమంత స్ఫూర్తితో నటించా: అనికా రావు
, శుక్రవారం, 10 మే 2019 (20:45 IST)
నాయిక ప్రధాన చిత్రంలో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాంటి అవకాశం మొదటి సినిమాతోనే అందుకుంది యువ తార అనికా రావు. ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ స్వయంవద ఈ నెల 17న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేక్షకులు ఆశ్చర్యపడేలా సరికొత్త నేపథ్యాన్ని ఈ సినిమాకు ఎంచుకున్నారు దర్శకుడు వివేక్ వర్మ. ఇదొక డైరెక్టర్స్ మూవీ అని చెప్పవచ్చు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా స్వయంవద ప్రేక్షకుల ముందుకు అన్ని ప్రముఖ కేంద్రాలలో ప్రదర్శనకు రాబోతోంది.
 
స్వయంవద విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నాయిక అనికా రావు మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి నాయిక కావాలని అనుకున్నాను. అనుష్క అరుంధతి, సమంత యూటర్న్ చిత్రాలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. అనుష్క, సమంత స్ఫూర్తితో స్వయంవద సినిమాలో నటించాను. నా పాత్ర ఆరు విభిన్నమైన ఛాయలతో సాగుతుంది. 
 
నాకు తొలి చిత్రమే నటనకు అవకాశమున్న ఇంత మంచి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకులు వివేక్ వర్మ సినిమాను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. నేను ఈ చిత్రం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మే 17న మా స్వయంవద చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మహర్షి సినిమాలో కళాశాల విద్యార్థిగా మహేష్ బాబుతో కలిసి నటించడం సంతోషంగా ఉంది అని చెప్పింది.
 
అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌,  సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్:  మోహ‌న్ జిల్లా, కెమెరా:  వేణు ముర‌ళీధ‌ర్.వి,  సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్:  సెల్వ కుమార్, నిర్మాత‌:  రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపండమ్మా మీ గోల... అక్కాచెల్లెళ్లకు ఝలక్ ఇచ్చిన హృతిక్ రోషన్