Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య సెట్‌కు సోనూ ఫ్యాన్స్.. ఐదు నెలల పాపకు ఆ పేరు.. ఏంటదో తెలుసా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (21:39 IST)
కరోనా కాలంలో స్టార్ విలన్ సోనూ సూద్ హీరో అయ్యాడు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి అండగా నిలుస్తున్నాడు. ఫలితంగా కలియుగ కర్ణుడు అనే పేరును సంపాదించాడు. వేలాది కార్మికులకు అండగా నిలిచిన సోనూ పేద ప్రజల కోసం సేవలను కొనసాగిస్తూనే వున్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" షూటింగ్‌లో సోనూ సూద్‌ బిజీగా ఉన్నాడు.
 
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో సోనూసూద్‌ హైదరాబాద్‌ వచ్చాడని తెలుసుకున్న ఓ కుటుంబం ఆయనను కలవడానికి ఖమ్మం నుంచి సిటీకి వచ్చారు. 
 
ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట తాజాగా షూటింగ్‌ జరిగే సెట్‌ వద్దకు వెళ్లి రియల్‌ హీరోను కలిశారు. తనను కలవడానికి ఓ ఫ్యామిలీ వచ్చిందని తెలుసుకున్న హీరో వారిని కలిశాడు. అంతేగాకుండా.. వారి కుటుంబంలోని ఐదు నెలల చిన్నారిని ఆడించాడు.
 
ఆ ఐదు నెలల చిన్నారికి సోనాలి సూద్‌ అని పేరు పెట్టినట్లు సమాచారం. ఇది సోనూసూద్‌ భార్య పేరు. దీంతో సంబరపడిపోయిన సోనూ వారితో సెల్ఫీలు తీసుకున్నాడు. ప్రస్తుతం సోనూ ఆ ఫ్యామిలీతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments