సోనూసూద్ అదుర్స్.. యువతికి ప్రత్యేక చికిత్స.. ఎయిర్‌ అంబులెన్స్‌‌ ఏర్పాటు

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (15:25 IST)
రియల్‌ హీరో సోనూసూద్‌ తన సేవాగుణాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్‌ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ యువతికి ప్రత్యేక చికిత్స అందించేందుకు సోనూ ముందుకు వచ్చారు. అంతేకాకుండా చికిత్స కోసం ఆమెను నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. మహారాష్ట్రకు చెందిన భారతి అనే యువతి ఇటీవల కోవిడ్‌ బారిన పడి నాగ్‌పూర్‌ ఆస్పత్రిలో చేరారు. 
 
వైరస్‌ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85శాతం వరకు దెబ్బతిన్నాయి. ఆమె ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స చేయాలని నాగ్‌పూర్‌ వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌.. ఆమెకు తగిన సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. వెంటనే ఆయన నాగ్‌పూర్‌ వైద్యుల్ని సంప్రదించగా హైదరాబాద్‌ అపోలోలో భారతికి అవసరమైన ట్రీట్‌మెంట్‌ అందుబాటులో ఉందని వాళ్లు సూచించారు. దీంతో హైదరాబాద్‌ అపోలో వైద్యుల్ని సంప్రదించిన సోనూ.. ప్రత్యేకంగా ఓ ఎయిర్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి భారతిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు పంపించారు. 
 
ప్రస్తుతం ఆమె అపోలోలో చికిత్స పొందుతున్నారు. "భారతి బతికేందుకు కేవలం 20శాతం మాత్రమే అవకాశముంది. అయినా చికిత్స చేయిస్తారా?" అని వైద్యులు నన్ను అడిగారు. తప్పకుండా చేయిస్తాను’ అని సమాధానం ఇచ్చాను. ఎందుకంటే ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఆమె కోలుకునే అవకాశముందని నిర్ణయించుకున్నాకే ఎయిర్‌ అంబులెన్స్‌ని ఏర్పాటు చేయించాను. అలాగే దేశంలోనే పేరుపొందిన వైద్యబృందం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు సోనూసూద్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments