సోనమ్ కపూర్.. ఆనంద్ అహుజాల వివాహం.. సంగీత్‌కు స్టెప్పులు నేర్చుకుంటున్న?

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనిల్ కపూర్ రెండో కుమార్తె.. బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్‌ త్వరలో పెళ్లికూతురు కానుంది. తన బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజాతో కలి

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (12:36 IST)
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనిల్ కపూర్ రెండో కుమార్తె.. బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్‌ త్వరలో పెళ్లికూతురు కానుంది. తన బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజాతో కలిసి సోనమ్ కపూర్ ఏడడుగులు వేయనుంది. మే తొలివారంలో వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమైనట్లు కపూర్ కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.
 
ఇందులో భాగంగా పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ వేడుకలో డ్యాన్సులతో సందడి చేసేందుకు సోనమ్‌కు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ స్టెప్‌లు కంపోజ్ చేశారు. ముంబైలోని జుహు ప్రాంతంలో అనిల్ కపూర్‌కు చెందిన బంగ్లాలో సంగీత్ రిహార్సల్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లికి కావాల్సిన ఆభరణాలను ఈ ఏడాది జనవరిలో సోనమ్ కపూర్ కొనిపెట్టేసింది. 
 
ఆనంద్ తల్లితో కలిసి ఆమె కోల్‌కతాలో జ్యువెలరీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఢిల్లీలో వుంటుందని తెలుస్తోంది. ఇక సోనమ్ నటించిన వీరే ది వెడ్డింగ్  సినిమా జూన్ ఒకటో తేదీన తెరపైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments