Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాలి బింద్రే న్యూలుక్... 'పైకి ఎదగడానికి కింద పడుతున్నావంటూ' ఆనంద్ మహీంద్రా ట్వీట్

కేన్సర్ బారినపడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే న్యూలుక్‌లో అదిరిపోయింది. కేన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆమె జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఆమె మరింత అందంగా

Webdunia
గురువారం, 12 జులై 2018 (10:38 IST)
కేన్సర్ బారినపడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే న్యూలుక్‌లో అదిరిపోయింది. కేన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆమె జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఆమె మరింత అందంగా కనిపించింది. ఈ సందర్భంగా భావోద్వేగానికిగురైన సోనాలి తన భర్త తనను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలియజేసేలా ఉన్న ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
 
ఈ పోస్ట్‌లో తన మనసులోని భావాన్ని కూడా ఆమె అక్షరాల రూపంలో పోస్ట్ చేసింది. "ఈ విశాల ప్ర‌పంచంలో నేను ఒంట‌రిదాన్ని కాద‌నే భావ‌న నాలో కొత్త ఆశ‌ల‌ను క‌లిగిస్తోంది. నా కోసం ప్రార్థించిన అభిమానులకు, స్నేహితులకు ధన్యవాదాలు. మ‌నుగ‌డ సాగించేందుకు మాన‌వులు చేసే ప్ర‌య‌త్నం అద్భుతమైనవి. క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడే మ‌న‌లో దాగి ఉన్న శ‌క్తి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్పుడే మనమెంత ధైర్యవంతులమో మ‌న‌కు తెలుస్తుంది" అని ఆ పోస్ట్‌లో తెలిపింది.
 
మరోవైపు, సోనాలి పోస్ట్‌పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. సోనాలి… నువ్వు త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతావ్ అంటూ, మేమందరం నీవెంట ఉన్నాం.. ఏం భయపడకు అంటూ సోనాలిని ఓదారుస్తున్నారు. సోనాలి పోస్ట్‌పై మహీంద్రా సీఈవో… ఆనంద్ మహీంద్రా స్పందించారు. నీలో దాగి ఉన్న మానసిక బలం, పాజిటివిటీ న్యూ లుక్‌‌లో వెలిగిపోతుంది సోనాలీ, మీరు పైకి ఎదగడానికి కింద పడుతున్నారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments