Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

నువ్వు ఊహించని విధంగా జీవితం నిన్ను ఎక్కడికో విసిరేస్తుంది : సొనాలీ బింద్రే

తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్ సోనాలీ బింద్రే. తెలుగులో "మురారి, ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌" వంటి తెలుగు చిత్రాల్లో నటిం

Advertiesment
Sonali Bendre
, గురువారం, 5 జులై 2018 (09:04 IST)
తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న హీరోయిన్ సోనాలీ బింద్రే. తెలుగులో "మురారి, ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌" వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఎక్కువ హిందీ సినిమాల్లో నటించిన ఆమె మరాఠీతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటనతో ఆకట్టుకుంది. అలాంటి నటికి దిగ్ర్భాంతికర విషయాన్ని వెల్లడించింది. తనకు కేన్సర్ సోకిందనీ, అది నాలుగో దశలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఈ కేన్సర్‌పై తన యుద్ధాన్ని కొనసాగిస్తానంటూ ప్రకటించింది.
 
తనకు సోకిన వ్యాధిపై సొనాలీ స్పందిస్తూ, కొన్ని సార్లు నువ్వు ఊహించని విధంగా జీవితం నిన్ను ఎక్కడికో విసిరేస్తుంది. ఈ మధ్యే నాకు హైగ్రేడ్‌ కేన్సర్‌ సోకినట్లు తేలింది. అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. ఈ విషయాన్ని మేం ముందుగా తెలుసుకోలేకపోయాం. కొంత నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఈ దిగ్ర్భాంతికర విషయం తెలిసింది అని పేర్కొంది. 
 
ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా నా కుటుంబం, స్నేహితులు నాతోనే ఉంటూ కావల్సినంత మద్దతు ఇస్తున్నారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి తక్షణ చర్య తీసుకోవడమే తప్ప మరో మార్గం లేదు. వైద్యుల సలహాతో ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నాను. ఈ సందర్భంలో నేను ఆశావహదృక్పథంతో ఉంటూ, పోరాడాలని నిశ్చయించుకున్నా. కొద్ది రోజులుగా నేను అపూర్వమైన ప్రేమ, మద్దతును పొందుతున్నాను. దీనికి కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితుల అండ, ప్రోత్సాహంతో కేన్సర్‌పై నా యుద్ధాన్ని కొనసాగిస్తా అంటూ సొనాలీ బింద్రే ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకా చోప్రా ప్రియుడు జంటిల్‌మన్.. ఎలాగంటే? (Video)