నేను బరువు తగ్గాలా? అయినా నా బరువుతో మీకేంటి పని?: సోనాక్షి

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన లింగా సినిమాతో పాటు దబాంగ్, హాలీడే, రౌడీ రాథోడ్ వంటి బ్లాక్ బస్టర్ హిందీ సినిమాల్లో నటించింది. తాజాగా అవకాశాలు ఆమెకు అంతంత మాత్రంగానే వున్

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (10:22 IST)
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన లింగా సినిమాతో పాటు దబాంగ్, హాలీడే, రౌడీ రాథోడ్ వంటి బ్లాక్ బస్టర్ హిందీ సినిమాల్లో నటించింది. తాజాగా అవకాశాలు ఆమెకు అంతంత మాత్రంగానే వున్నాయి. ఇందుకు ఆమె బరువు కారణమని నెట్టింట చర్చ మొదలైంది. అమ్మడు బరువు తగ్గితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఉచిత సలహాలిచ్చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా నెటిజన్లపై మండిపడింది. సోషల్ మీడియాలో కొందరు ఆమె శరీరాకృతిపై సెటైర్లు విసురుతూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సోనాక్షి ఫైర్ అయ్యింది. చాలామంది తన లుక్ గురించి వేరొకరితో పోల్చి కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే తాను లావుగా వుండేదానినని.. అయితే ఆ బరువు చూసుకుని ఎప్పుడూ తాను ఇబ్బంది పడలేదని చెప్పింది. 
 
కానీ కొంతమంది మాత్రం తన బరువు లెక్కేయడం.. ఎన్ని కేజీలు తగ్గాలో సలహాలు ఇచ్చేస్తున్నారు. అయినా తన బరువు గురించి వారికెందుకని ప్రశ్నించింది. టాలెంట్‌ను తక్కువ చేసి బరువు, లుక్ అనే విషయాలు పట్టుకుని వేలాడటం చాలా చీప్ అంటూ సోనాక్షి మండిపడింది. తనకేది మంచిదో అదే చేస్తాననీ, ఇతరుల కామెంట్లతో ఒత్తిడి పెంచుకోనని సోనాక్షి క్లారిటీ ఇచ్చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments