ఎన్ని వున్నా థియేట‌ర్ అనుభూతే వేరుః విశ్వక్ సేన్

Webdunia
గురువారం, 29 జులై 2021 (14:30 IST)
Dinesh Tej,Vishwak Sen, Pawan Kumar
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు.
 
విశ్వక్ సేన్ మాట్లాడుతూ, దినేష్ తేజ్ నేనూ 'హుషారుస‌ నుంచి ఫ్రెండ్స్. కలిసి క్రికెట్ బాగా ఆడేవాళ్లం. తను మంచి పర్మార్మర్. ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చివరలో దినేష్ చెప్పిన డైలాగ్ సూపర్. థియేటర్లు ఓపెన్ అవడం సంతోషకరం. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్ లో సినిమా చూసిన అనుభూతి వేరు. ఆగస్టు 6న 'మెరిసే మెరిసే' థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. తప్పక చూడండి అన్నారు.
 
దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మీ ముందుకొస్తున్న 'మెరిసే మెరిసే' సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
- హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ, మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు నా ఫ్రెండ్ విశ్వక్ సేన్ కు థాంక్స్. ఆగస్టు 6న థియేటర్ లలో కలుసుకుందాం. అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments