Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామెడీ ఎంటర్ట్ టైనర్ గా సాఫ్ట్ వేర్ బ్లూస్ ఈనెల 31న విడుద‌ల‌

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:02 IST)
Software Blues still
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  “సాఫ్ట్ వేర్ బ్లూస్”. సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్నిఈ నెల 31 న విడుదల చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,  సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా వారి సాధ‌క‌బాధ‌లు తెలిసిన‌వాడిగా సినిమా తీశాను. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ను తెలుపుతూ ఫ‌న్నీగా తీశాను.  నటించిన వారెవరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కాకున్నా డెడికేషన్ తో వర్క్ చేశారు.. హీరో హీరోయిన్స్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మా కొలీగ్స్ సపోర్ట్ వల్ల సినిమాను కంప్లీట్ చేశాము. డిస్ట్రిబ్యూటర్ ఠాగూర్ సపోర్ట్ తో  డిసెంబరు 31 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు.
 
సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వి.కె రాజు మాట్లాడుతూ.. చక్కటి కథను సెలెక్ట్ చేసుకొన్న దర్శకుడు ఉమా శంకర్  సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ గా తెరకెక్కించాడు.ఇందులో పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా చూసిన వారందరి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్నారు
 
నటుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ, సాఫ్ట్ వేర్ కు సంబంధం లేని వారికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఓటిటి లో రిలీజ్ చేయమని ఎన్నో ఆఫర్స్ వచ్చినా  సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్ తో థియేటర్స్ లో విడుదల చేస్తున్నారని తెలిపారు.
 
హీరో శ్రీరాం మాట్లాడుతూ,  సాఫ్ట్ వేర్ అంటే  లగ్జరీ జీవితం అనుకుంటారు. చిత్ర దర్శకుడు  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తూ తనకు వస్తున్న నాలుగు లక్షల జీతాన్ని వదులుకొని సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో సినిమా తీశారు. ఈ సినిమా చూసిన వారందరికీ  “సాఫ్ట్ వేర్ బ్లూస్” కచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్నారు.
 
హనీష్ మాట్లాడుతూ .. ప్రీమియర్ చూసిన వారంతా హ్యాపీడేస్ మూవీ లా ఉందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ కు చాలా కష్టపడ్డారు. ఓటిటి లో ఆఫర్ వచ్చినా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా వారికి గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను అన్నారు.
 
డిస్టిబ్యూటర్ ఠాగూర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీమియర్ లో అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చక్కటి కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ఓటిటి లో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్ లోనే విడుదల చేయాలని చెప్పడంతో వారి సహకారంతో ఈ నెల 31 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. 
 
హీరోయిన్ భావన మాట్లాడుతూ. .చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్ & టర్న్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments