Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (17:30 IST)
తిరువణ్ణామలై అరుణాచలక్షేత్ర ప్రదర్శనకు వెళ్లిన సినీ నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న చేసిన పనికి భక్తులు మండిపడుతున్నారు. దీంతో ఆమె వివాదంలోకి చిక్కుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, స్నేహ, ఆమె భర్త ప్రసన్న కుమార్ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి గిరిప్రదక్షిణ చేశారు. ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొడుతూ కాలినడకన గిరిప్రదక్షిణ చేశారు. అయితే, గిరిప్రదక్షిణ చేసేటపుడు వీరిద్దరూ కాళ్లకు చెప్పులు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 
 
దీంతో స్నేహ, ప్రసన్నలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు వేసుకుని గిరిప్రదక్షిణ చేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపచారం చేశారని, ఇది మహాపాపమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలియక చేసుంటారని, స్నేహ దంపతులకు కొందరు అండగా నిలుస్తున్నారు. 
 
మన దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అరుణాచలం దర్శనానికి ముందు జీవితం వేరు, దర్శనం తర్వాత దర్శనం వేరు అని భక్తులు భావిస్తుంటారు. గిరిప్రదక్షిణ చేసి శివుడుని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు అరుణాచలంకు చేరుకుని స్వామివారిని సందర్శిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments