Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

దేవీ
శనివారం, 2 ఆగస్టు 2025 (16:17 IST)
Sai Rajesh, PVNS Rohit, Vaishnavi Chaitanya, Anand Deverakonda, SKN
డైరెక్టర్ సాయి రాజేశ్ కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి మూవీకి నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న డైరెక్టర్ గా గౌరవం పొందారు. ఆయన నెక్ట్స్ చేయబోయే ప్రతి సినిమాకు ఈ మూవీ చేస్తున్నది నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఇది గొప్ప గౌరవం. బేబి సినిమాను ఎంతగానో నమ్మారు నిర్మాత ఎస్ కేఎన్. ఈ మూవీని ప్రమోషన్ చేసిన విధానం ఎన్నో సినిమాలకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అయ్యింది అని ఆనంద్ దేవరకొండ అన్నారు.
 
71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.
 
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, ఏదైనా గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని సాయి రాజేశ్ గారు ప్రూవ్ చేశారు. సినిమా రిలీజై రెండేళ్లు దాటినా ఇంకా బేబి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అంతా సాయి రాజేశ్ గారి క్రియేషన్ వల్లే. అలాగే ఎస్ కేఎన్ గారు ఈ ప్రాజెక్ట్ ను ఎంతో నమ్మి ప్రొడ్యూస్ చేశారు. ప్రేమిస్తున్నా పాట వింటూనే మేమంతా ఒక మూడ్ లో ఉండి సినిమా షూటింగ్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 100 అడుగుల పెయింటింగ్ వేయించారు. "బేబి" సినిమాలాగే ఈ పాట కూడా మా మనసుల్లో ఉండిపోయింది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తే ఒకప్పుడు మన తెలుగు సినిమాకుకు పురస్కారాలు కనిపించేవి కావు. ఈ ఏడాది దాదాపు పది నేషనల్ అవార్డ్స్ టాలీవుడ్ కు దక్కాయి. ఇది తెలుగు సినిమా గర్వించాల్సిన సందర్భం. నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న తెలుగు మూవీస్, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అందిరకీ కంగ్రాంట్స్ చెబుతున్నాం. ఒక చెట్టు పెంచితే అది పండ్లు ఇవ్వడమే కాదు ఎండిపోయాక కూడా ఇళ్లు కట్టుకునేందుకు కలప ఇస్తుంది. అలా ఒక మంచి మూవీ చేస్తే అది మనకు డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తుంది. బేబి సినిమా మాకు డబ్బుతో పాటు ఫిలింఫేర్, సైమా, గామా వంటి ఎన్నో పురస్కారాలు తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ దక్కడం మరింత హ్యాపీగా ఉంది. నా మిత్రుడు సాయి రాజేశ్ బేబి సినిమాను ఎంతో నమ్మాడు. కొన్నేళ్లు కథపై కసరత్తు చేశాడు. అందుకే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. సాయి రాజేశ్ కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి సినిమాకు నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ప్రేమిస్తున్నా పాటను రోహిత్ చాలా బాగా పాడాడు. ఈ పాట లిరికల్ సాంగ్ ను మూడు రోజులు చిత్రీకరించాం. మనం మూవీలో ఫుల్ సాంగ్ చేసే టైమ్ అది. రశ్మిక మందన్న ఈ పాటను రిలీజ్ చేశారు. అక్కడి నుంచి బేబి సినిమా ఆడియెన్స్ తో కనెక్ట్ కావడం ప్రారంభమైంది అన్నారు.
 
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ, ఈ సినిమా స్క్రిప్ట్ రాసేప్పడు ఒక మూడ్ లో ఉండిపోయేవాడిని. నేనే ఆనంద్ అయితే, విరాజ్ అయితే ఎలా ఉంటానో ఆ మూడ్ లో ఉండి స్క్రిప్ట్ రాశాను. రెండేళ్లు ఈ కథ నా మైండ్ లో ఉండిపోయింది. ప్రతి సీన్ ను బెటర్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేశాను. స్క్రీన్ ప్లేకు నేషనల్ అవార్డ్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా సాంగ్ కు బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఆనందపడ్డాను. ఈ పాట లాస్ట్ లో కంపోజ్ చేద్దామని మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ తో చెప్పాను. ఈ పాట విషాధకరమై  మూడ్ లో ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ లో వాళ్లు హ్యాపీగా ఉన్న మూవ్ మెంట్స్ ఉంటాయి. విజయ్ బుల్గానిన్ ఫస్ట్ ఈ సాంగ్ చేద్దామని మొదలుపెట్టాడు. 
 
సురేష్ బనిశెట్టి ప్రేమిస్తున్నా పాటలో మన కథలాంటి మరో కథ చరితలో ఉండదంటనే అని రాశాడు. ఈ లైన్ చదవగానే చాలా ఇన్స్ పైర్ అయ్యాను. రోహిత్ పాడిన పాట వినగానే ఈ సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ప్రేమిస్తున్నా పాట ఇచ్చిన స్ఫూర్తితో బేబి సినిమాను మరింత హార్ట్ టచింగ్ గా రూపొందించాను.  ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ హీరోనే. అంత ప్రాణం పెట్టి పనిచేశారు. నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్ కేఎన్ నమ్మాడు. థ్యాంక్ యూ. మాకు ఎంతో సపోర్ట్ అందిస్తున్న మీడియాకు థ్యాంక్స్. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Google: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఏమిటంటే..?

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments