Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్‌కు రెఢీ అయితే, కెమెరా కనిపించదు.. ఫ్యాన్సే కనిపిస్తారు : హీరో రామ్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (15:29 IST)
బోయపాటి దర్శకత్వంలో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద. శ్రీలీల హీరోయిన్. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో రిలీజ్ చేశారు. ముఖ్య అతిథిగా నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ఇందులో హీరో రామ్ మాట్లాడుతూ, "మూడు తరాలు ప్రేక్షకులను మెప్పించడం బాలయ్యకే సాధ్యమైందన్నారు. బోయపాటి ఒక విషయాన్ని నమ్మారు అంటే, ఇక ఆయన మొండిగా ముందుకు వెళ్లిపోతారు. ఆయనలో నాకు నచ్చినది అదే. తనకి కావలసిన అవుట్ పుట్ వచ్చేవరకూ అక్కడే నిలబడతారు. ఇక శ్రీలీల విషయానికి వస్తే, తాను మంచి డాన్సర్. తనకి మంచి ఫ్యూచర్ ఉందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. 
 
'ఇక నేను యాక్షన్‌కి రెడీ అయితే నా ముందు కెమెరా కనిపించదు.. నా అభిమానులే కనిపిస్తారు. నా కిక్కూ వాళ్లే. అలా వాళ్లను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమానే ఇది. వాళ్లకి కావలసిన అవుట్ పుట్‌ను అందించడం కోసమే సెట్లో నేను సైలెంట్‌గా ఉంటాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
 
ఆ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, 'బాలయ్య బాబుతో నేను 15 ఏళ్లుగా జర్నీ చేస్తున్నాను. ఆయన ఒక వ్యక్తి కాదు. శక్తి. పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రను లొంగదీసుకునే నటుడు ఆయన. మా మధ్య గల సాన్నిహిత్యం కారణంగా ఆయన ఈ వేడుకకి వచ్చారు. ఆయన ఆశీర్వాదానికి ఎంత బలం ఉందనేది నాకు తెలుసు" అన్నారు.
 
అలాగే, 'రామ్‌లో ఎనర్జీ ఎక్కువని అంతా అంటారు. నేను మాత్రం ఆయనకి తపన ఎక్కువని చెబుతాను. ఆ తపన వల్లనే ఆయన ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక శ్రీలీల విషయానికి వస్తే, ఆమె మంచి డాన్సర్ మాత్రమే కాదు, అంతకుమించిన మంచి ఆర్టిస్టు. ఆమెను ఇప్పుడు ఏ హీరో పక్కన చేయడం లేదు అని అడగవలసి వస్తోంది. అంత బిజీ హీరోయిన్ అయిపోయారు' అంటూ నవ్వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

నిమ్స్ ఆస్పత్రి అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య!!

నీట్ యూజీలో తప్పులు జరిగిన మాట వాస్తవమే.. కానీ రద్దు చేయొద్దు : ఎన్.టి.ఏ!!

కాటేసిన పాము పట్టుకుని కొరికిన బీహార్ వారీ.. పాము చనిపోయింది.. మనిషి బతికాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments