Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్ ప్రిన్స్ విడుదలకు సిద్ధ‌మైంది

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:21 IST)
prince
శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.  తాజాగా అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు చెబుతూ నిర్మాతలు  ప్రిన్స్ విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 21న ప్రిన్స్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  గ్రాండ్ గా విడుదల కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో శివకార్తికేయన్ హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దసరాకి పర్ఫెక్ట్  ట్రీట్ గా ఈ పోస్టర్ ఆకట్టుకుంది.
 
ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లు భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి'' , డి జెస్సికా' పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments