Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివకార్తికేయన్ ప్రిన్స్ నుండి జెస్సికా' లిరికల్ వీడియో

Advertiesment
శివకార్తికేయన్  ప్రిన్స్  నుండి జెస్సికా' లిరికల్ వీడియో
, శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:27 IST)
Sivakarthikeyan, Maria Ryaboshapka
శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.
 
ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లు భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి'' చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి 'జెస్సికా' లిరికల్ వీడియోని విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిలీష్  బీట్ లో డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్  చేశారు. తమన్ ఈ పాటని స్వయంగా పాడటంతో పాటు లిరికల్ వీడియోలో ఆయన కనిపించడం మరో విశేషం. తమన్ వాయిస్ లో ఈ పాట ఇన్స్టంట్ అడిక్షన్ గా అలరిస్తోంది.
 
శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. శివకార్తికేయన్,  మారియా కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. 'సరస్వతీ పుత్ర' రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఇన్స్టంట్ అడిక్షన్ గా అలరించిన జెస్సికా పాట ప్రిన్స్ ఆల్బమ్ లో మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది.
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.
తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేహా చౌదరికి బ్రియాన్‌ లారా సపోర్టా.. వామ్మో ఇది నిజమేనా?