Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షంలోకి తొలి తెలుగు మహిళ.. శిరీష.. బండ్ల గణేష్ బంధువా?

Webdunia
శనివారం, 3 జులై 2021 (11:33 IST)
Sirisha Bandla
అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తొలి తెలుగు మహిళగా శిరీష పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల మరికొన్ని రోజుల్లో అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. వర్జిన్‌ గెలాక్టిన్‌ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 
 
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష​కూడా ఉన్నారు. దీంతో ఆమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే ఈ విషయమై బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆసక్తికరగా మారింది. శిరీష సాధించిన ఈ ఘనతపై బండ్ల ట్వీట్ చేస్తూ.. #8216;డాక్టర్‌ మురళీధర్‌ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు శిరీష బండ్ల జులై 11 ఉదయం 9 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. నీ విజయం పట్ల మాకు ఎంతో గర్వంగా ఉంది శిరీష. శుభాకాంక్షలు#8217; అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. 
 
ఇంతకీ శిరీష.. బండ్లా గణేశ్‌కు బంధువు అవుతుందా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి శిరీష నిజంగానే బండ్ల గణేశ్‌కు బంధువు అవుతుందా? లేదా అన్నది తానే స్వయంగా తెలియజేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments