Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైది గా జ‌యం ర‌వి, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ గా కీర్తి సురేష్ నటించిన సైర‌న్‌ రాబోతుంది

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (19:50 IST)
Siren, Jayam Ravi
జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సైర‌న్‌’. హెమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆంటోని భాగ్య‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విడుద‌ల చేశారు. కోలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న జ‌యం ర‌వి మ‌రోసారి ‘సైర‌న్‌’ వంటి డిఫ‌రెంట్ చిత్రంతో మ‌న ముందుకు రాబోతున్నారు. ఆయ‌న ఇందులో స‌రికొత్త‌గా తొలిసారి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. 
 
‘సైర‌న్‌’ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరుగుతోంది. సైర‌న్‌తో వెళ్లే అంబులెన్స్, జ‌యం ర‌వి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో ఖైదిగా క‌నిపించ‌టం క్యూరియాసిటీని పెంచాయి. పెరోల్‌పై జ‌యం ర‌వి జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే సీన్ ద్వారా హీరో క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేశారు మేక‌ర్స్‌. 
 
టీజ‌ర్‌లో ప్ర‌ధానంగా రెండు పాత్ర‌ల మ‌ధ్య న‌డిచే క‌థ ఇద‌ని చూపించారు. ఖైది పాత్ర‌లో జ‌యం ర‌వి న‌టిస్తుండ‌గా, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. సినిమాలో డ్రామా, ట్విస్టులు, ట‌ర్నులు చూస్తుంటే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచుతున్నాయి. 
 
అభిమ‌న్యుడు, విశ్వాసం, హీరో వంటి ప‌లు చిత్రాల‌కు రైట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న ఆంటోని భాగ్యరాజ్ సైర‌న్‌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. జ‌యం ర‌వి త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నడూ చేయ‌ని విధంగా రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో మెప్పించ‌బోతున్నారు. అలాగే జ‌యం ర‌వి స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారి న‌టిస్తుంది. యోగి బాబు త‌న‌దైన కామెడీ పంచుల‌తో న‌వ్వించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. విల‌క్ష‌ణ  న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. 
 
చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న సైర‌న్‌ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా ట్రైల‌ర్‌, ఆడియో, మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments