Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరిహార పూజ చేశాకే కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ?

Advertiesment
Parihara puja
సినీనటి కీర్తి సురేష్ సినీ భవితవ్యంపై జ్యోతిష్యులు వేణు స్వామి కామెంట్స్ చేశారు. కెరీర్‌లో ఆమె ఇబ్బంది పడకుండా వుండాలంటే.. ఆమె చేత పరిహార పూజ చేయించాలట. 
 
ఈ మేరకు కీర్తి సురేష్ తల్లి వేణు స్వామి చేతుల మీదుగా పూజలు చేయించాలని భావిస్తోందట. ఆ తర్వాతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
కాగా కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోదరిగా భోళా శంకర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో కీర్తి సురేష్ కూడా ట్రోల్స్‌కు గురైంది. అయితే త్వరలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆమెకు అంతా కలిసి రావాలని జ్యోతిష్యుడు వేణు స్వామి వద్ద పూజలు చేయించాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావణ్య త్రిపాఠికి రూ.3కోట్లు నష్టం.. ఎందుకో తెలుసా?